వలస కార్మికుల హీరోగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను ముంబయిలోని బాంద్రా రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్(రైల్వే రక్షణ దళం) సిబ్బంది అడ్డుకున్నారు. సోమవారం రాత్రి శ్రామిక్ రైలులో ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళుతున్న వలస కూలీలను కలిసేందుకు వెళ్లిన సోనూసూద్‌ను ఆపారు. 'సోనూసూద్ భాజపా చేతిలో కీలుబొమ్మ' అని శివసేన ఆరోపించిన కొద్ది రోజులకే మహారాష్ట్రలోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
అయితే ఈ విషయంపై సోనూసూద్ తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొన్నారు.
"సోనూసూద్‌ను ఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు, మేము కాదు. స్వస్థలాలకు వెళ్తున్న కార్మికులను ఆయన కలవాలనుకున్నారు. అయితే ఆయన నుంచి మాకు ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదు."
-- శశికాంత్ భందారే, నిర్మల్ నగర్ సీనియర్ ఇన్స్పెక్టర్.
ఈ విషయంపై బాలీవుడ్ నటుడు స్పందించాడు.
"నన్ను ప్లాట్‌ఫాంలోకి అనుమతించకపోయినా నేను పట్టించుకోను. వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేయడం నా బాధ్యత. వారు బాగుండాలని చెప్పడానికే ఇక్కడికి వచ్చా."
--- సోనూసూద్, బాలీవుడ్ నటుడు.
అయితే ఆర్పీఎఫ్ సిబ్బంది మాత్రం.. ముంబయి రైల్వే డివిజనల్ మేనేజర్ ఆదేశాలు లేనందువల్లే సోనూను అడ్డుకున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:- వలసకూలీల పాలిట దేవుడు సోనూసూద్!