ETV Bharat / bharat

కొవిడ్​ సంక్షోభంలో ప్రధానికి సోనియా 5 సూచనలు

కరోనా వైరస్​ దేశంలో వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు సూచనలు చేస్తూ లేఖ రాశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రభుత్వం దగ్గరున్న నిధులను సంరక్షించుకునేందుకు మీడియాకిచ్చే ప్రకటనలపై రెండేళ్లపాటు నిషేధం విధించాలని కోరారు.

Sonia writes to PM, suggests measures to save money to fight COVID-19
కొవిడ్​ సంక్షోభంలో ప్రధానికి సోనియా 5 సూచనలు
author img

By

Published : Apr 7, 2020, 4:41 PM IST

కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక ఖజానాను ఎలా సంరక్షించుకోవాలన్న అంశంపై ఐదు సూచనలు చేశారు.

సోనియా సూచనలు..

  • రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, ముఖ్య మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు.. అన్ని విదేశీ పర్యటనలను రెండేళ్ల పాటు వాయిదా వేయాలి.
  • పీఎం కేర్స్‌లోకి వస్తున్న మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిర్వహణ నిధిలోకి వచ్చేలా చేసి జవాబుదారీతనం తీసుకురావాలి.
  • ప్రభుత్వ రంగసంస్థలు, ప్రభుత్వం.. మీడియాకిచ్చే ప్రకటనలపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలి.
  • కేవలం కొవిడ్‌-19కి సంబంధించిన సమాచారం మాత్రమే ఇవ్వాలి.
  • పార్లమెంటు భవనాలు కొత్తవి తీసుకురావడానికి కేంద్రం చేపట్టిన 20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా నిలుపుదల చేయాలి. ప్రస్తుత భవనంలోనే పార్లమెంటు కార్యకలాపాలకు ఏ ఢోకా లేదు.

ఇదీ చూడండి:'వలస కూలీల వేతనాలపై ఇప్పుడే జోక్యం చేసుకోలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.