యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ వార్‌రూంలో ఎంపీలకు నిర్వహించిన ఈ అవగాహనా కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు.
పార్లమెంటులో వ్యవహరించాల్సిన విధివిధానాలపై నూతన ఎంపీలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ ప్రసంగించలేదు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కే సురేశ్, రాజీవ్ గౌడ, జైరాం రమేశ్ ఈ భేటీలో పాల్గొన్నారు.
నేడు పార్టీ లోక్‌సభ ఎంపీలతో సోనియా గాంధీ సమావేశం కానున్నారు.
రాజ్ ఠాక్రేతో భేటీ...
సోనియాగాంధీని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కలిశారు. దిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఈవీఎంల అంశం సహా మహరాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సోనియాగాంధీ, రాజ్ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.