పార్లమెంటులో కాంగ్రెస్ సేనానిగా మరోసారి సోనియా గాంధీనే నియమితులయ్యారు. దిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీని ఎన్నుకున్నారు ఎంపీలు. సోనియా పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా సభ్యులు అందరూ ఆమోదం తెలిపారు.
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ... ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు.
12 కోట్ల 13 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు సోనియా గాంధీ. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
-
Smt. Sonia Gandhi elected as the leader of Congress Parliamentary Party!
— Randeep Singh Surjewala (@rssurjewala) June 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
She says, ‘we thank the 12.13 Cr voters for reposing faith in the Congress Party’. pic.twitter.com/H4z9i3dN8B
">Smt. Sonia Gandhi elected as the leader of Congress Parliamentary Party!
— Randeep Singh Surjewala (@rssurjewala) June 1, 2019
She says, ‘we thank the 12.13 Cr voters for reposing faith in the Congress Party’. pic.twitter.com/H4z9i3dN8BSmt. Sonia Gandhi elected as the leader of Congress Parliamentary Party!
— Randeep Singh Surjewala (@rssurjewala) June 1, 2019
She says, ‘we thank the 12.13 Cr voters for reposing faith in the Congress Party’. pic.twitter.com/H4z9i3dN8B
లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పాత్రను ప్రశంసించారు సోనియా గాంధీ. చైతన్యంతో పార్టీని ముందుకు నడిపించారని కొనియాడారు. 52 మంది ఎంపీలతో ప్రతిపక్ష పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామన్న సోనియా... ప్రజా సమస్యల కోసం పోరాడుతామని వ్యాఖ్యానించారు.
సీపీపీ నేతగా ఎన్నికైనందుకు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. భాజపాపై ప్రతిరోజు పోరాటం చేస్తామని చెప్పారు.
'కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమె నాయకత్వంలో.. రాజ్యాంగ పరిరక్షణ కోసం సమర్థమంతమైన ప్రతిపక్ష పార్టీగా నిరూపించుకుంటాం.'
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు