అరుణాచల్ ప్రదేశ్ ఆలోలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం సాధిస్తోన్న విజయాల పట్ల నిరాశగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఈశాన్య భారతంలో కమల వికాసం అరుణాచల్ నుంచే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు.
"మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశలతో గౌరవించారు. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత అరుణాచల్‌ను రైల్వే పటంలో చేర్చే అవకాశం కాపలాదారుకు దక్కింది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి