జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఓ జవాను తప్పిపోవడం చర్చనీయాంశంగా మారింది. 8 జాట్ రెజిమెంట్‌కు చెందిన సైనికుడు బోనియర్ పోలీస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఆచూకీ కోల్పోయినట్లు సైన్యాధికారులు ఫిర్యాదు చేశారని స్థానిక పోలీసులు వెల్లడించారు.
'ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైనికుడు ఆచూకీ కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా జీలం నదిలో మునిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నామ'ని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సైనికుడి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: ఉగ్ర కుట్రకు పాల్పడిన మహిళకు కరోనా