కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. వైరస్ను జయించేందుకు సామాజిక దూరం అత్యంత కీలకంగా మారిన వేళ.. చాలావరకు పెళ్లిళ్లు, పేరంటాలు వాయిదా పడ్డాయి. అయితే, మధ్యప్రదేశ్లో ఓ జంట మాత్రం పెళ్లిని వాయిదా వేయలేదు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా సామాజిక దూరం పాటిస్తూ ఒక్కటయ్యారు.
షాజాపుర్, కాఛివాడకు చెందిన భావన, చందన్ల వివాహం లాక్డౌన్కు ముందే నిశ్చయమైంది. బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంచేశారు. అన్ని రకాల వంటకాలతో మెనూ సిద్ధమైంది. మంగళ స్నానాలూ అయిపోయాయి. ఇక వేలాది మంది మధ్య ధూంధాంగా పెళ్లి జరగడమే ఆలస్యమనుకున్నారు. అంతలో దేశంలో కరోనా వ్యాప్తి పెరగేసరికి, ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.
అయితే, కేవలం లాక్డౌన్ కారణంగా వివాహ ముహుర్తాన్ని వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు ఇరుకుటుంబాలు. అలా అని ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేయలేదు. సామాజిక దూరం పాటిస్తూ.. నిశ్చయమైన సమయానికి పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేశారు. పురోహితుడు, బ్యాండ్బాజాలు, జనసమూహాలు వంటి హడావిడి లేకుండా... అతితక్కువ మందితో పెళ్లి జరిపించేశారు.
ఇదీ చదవండి:కరోనా సోకిందనే నిందలు భరించలేక ఆత్మహత్య