ETV Bharat / bharat

అగ్రదేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన

నూతన విద్యావిధానం వల్ల పిల్లలు చిరుప్రాయంలోనే మాతృభాషలో విద్య నేర్చుకొనే అవకాశం లభిస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సొంత భాషలో చదవడం వల్ల మనోవికాసం లభిస్తుందన్నారు. అగ్రదేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నారని పేర్కొన్నారు. 'స్మార్ట్​ ఇండియా హ్యాకథాన్‌-2020'లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

smart India hackathan-2020
అగ్రదేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన
author img

By

Published : Aug 2, 2020, 6:42 AM IST

కొత్త విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా అవి ముందడుగు వేస్తాయని చెప్పారు. 'ఇప్పటివరకూ మన స్థానిక భాషలను వాటి మానాన వాటిని వదిలేశాం. వాటిని కాపాడి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా చేయలేదు. ఇప్పుడు కొత్త విద్యా విధానంతో దక్కిన ప్రాముఖ్యత వల్ల అన్ని భారతీయ భాషలు వికసిస్తాయి. ఇవి భారతీయ విజ్ఞానంతో పాటు ఏకత్వాన్నీ బలోపేతం చేస్తాయి' అని తెలిపారు.

శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ‘హ్యాకథాన్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. నూతన విద్యా విధానం వల్ల పిల్లలు చిరుప్రాయంలోనే మాతృభాషలో విద్య నేర్చుకొనే అవకాశం లభిస్తుందన్నారు. 'ఫలితంగా వారి ప్రతిభ మరింత ఇనుమడిస్తుంది. సొంతంగానే సరికొత్త విషయాలు నేర్చుకోవడానికి స్ఫూర్తి లభించడంతోపాటు చదువుతో మమేకమవడానికి వీలవుతుంది' అని పేర్కొన్నారు. జీడీపీ ఆధారంగా ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్న దేశాల్లో అనేకం.. పిల్లలకు మాతృభాషల్లోనే విద్యాబోధన చేస్తున్నాయన్నారు. ఆ దేశాలు యువత ఆలోచనలు, అవగాహన శక్తిని స్వభాషలోనే వికసింపజేసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. 'అదే సమయంలో ప్రపంచంతో సంభాషించేందుకు మిగతా భాషలకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ వ్యూహం 21వ శతాబ్దంలో భారత్‌కు లబ్ధి కలిగించనుంది' అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

" భారత్‌ వద్ద బహు భాషల ఖజానా ఉంది. వాటిని నేర్చుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. శతాబ్దాల జ్ఞానం, అనుభవం అందులో నిక్షిప్తమై ఉంది. ఇక అది మరింత విస్తృతమవుతుంది. 21వ శతాబ్దపు యువత ఆలోచనలు, అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని కొత్త విద్యా విధానాన్ని రూపొందించాం. ప్రస్తుతం పిల్లలు.. డిగ్రీలు చేతికొచ్చినా వారు ఏదో అసంతృప్తికి లోనవుతుంటారు. ఫలితంగా వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కొత్త విద్యా విధానంలో దీన్ని మార్చే ప్రయత్నం చేశాం. విద్యా వ్యవస్థలో క్రమబద్ధమైన సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఉద్దేశం, విషయా (ఇంటెంట్‌, కంటెంట్‌)న్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం.

చదువు, పరిశోధన, నవకల్పనపై మరింత దృష్టి సారించాల్సిన సమయం ఇదే. ఇప్పుడు జాతీయ విద్యావిధానం అదే చేస్తోంది. మీ సహజ ఇష్టాలకు మరింత వన్నెతెస్తుంది. యువత లెర్నింగ్‌, క్వశ్చనింగ్‌, సాల్వింగ్‌ (అభ్యాసం, ప్రశ్నించడం, పరిష్కరించడం)ని మరిచిపోకూడదు. కొత్త విద్యావిధానంలో చేపట్టిన అతిముఖ్యమైన మార్పు బహుళ విషయాల అధ్యయనం. ఒకే విధానం అన్నింటికీ సరిపోదు. ఇష్టమైన సబ్జెక్టులు చదువుకొనే అవకాశాన్ని కొత్త విద్యావిధానం కల్పిస్తోంది. విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్న అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానాన్ని రూపొందించాం. ఉద్యోగాలను సృష్టించేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

హైదరాబాద్‌ విద్యార్థులకు ప్రధాని అభినందన

smart India hackathan-2020
ఎంఎల్ఆర్​ఐటీ విద్యార్థులు

ఇండియా స్మార్ట్‌ హ్యాకథాన్‌లో పాల్గొని, నేరాలను అరికట్టడానికి వివిధ కొత్త సాంకేతిక పరిష్కారాలు చూపిన హైదరాబాద్‌ విద్యార్థులను ప్రధాని అభినందించారు. హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి అమృత, కేఎంఐటీ విద్యార్థి జతిన్‌, సీఎంఆర్‌ టెక్నికల్‌ క్యాంపస్‌ విద్యార్థి మన్‌ప్రీత్‌ సింగ్‌లతో నేరుగా ప్రధాని సంభాషించారు. ముఖ కవళికలను బట్టి నేరగాళ్లను అప్పటికప్పుడు గుర్తించే సాఫ్ట్‌వేర్‌ గురించి మోదీకి అమృత వివరించారు. ప్రధాని స్పందిస్తూ.. అందరూ ముఖానికి మాస్కులు పెట్టుకున్నప్పుడు అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కళ్ల మధ్య ఖాళీ, దవడ ఎముకలు, ముక్కును బట్టి కనుక్కోవచ్చని విద్యార్థిని బదులిచ్చారు. జతిన్‌ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కోసం తాము వర్చువల్‌ పోలీస్‌ స్టేషన్‌ నమూనాను రూపొందించినట్లు పేర్కొన్నారు. 3డీ ఆగ్మెంటెడ్‌ రియాల్టీ వర్చువల్‌ అధికారి ద్వారా ఫిర్యాదులు స్వీకరించి, బాధితులతో మాట్లాడి అప్పటికప్పుడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని స్పందిస్తూ.. మహిళలు, పిల్లలకు సంబంధించి రియల్‌ టైమ్‌ అలర్ట్‌ సిస్టం రూపొందించడానికి వీలవుతుందా? పాఠశాలలు, ఆఫీసులు, స్థానిక పోలీసుస్టేషన్లతో అది అనుసంధానమయ్యేలా చూడగలరా? స్కూల్‌ బస్సులు, వ్యాన్లు, క్యాబ్‌లను పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లతో ఎలా అనుసంధానం చేస్తారని ప్రశ్నించారు. అది సాకారం చేయగలమని జతిన్‌ బదులిచ్చారు. మన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ నేరగాళ్లు సీసీటీవీల్లో కనిపిస్తే పోలీసు స్టేషన్‌కు సమాచారమిచ్చే వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. పోలీసు అకాడమీ హైదరాబాద్‌లో ఉండటంవల్ల మీరంతా పోలీసు సమస్యలపై దృష్టిసారించారా? అని ప్రధాని నవ్వుతూ ప్రశ్నించారు. 'మిమ్మల్ని ఆ అకాడమీకి పంపి.. మీ ఆవిష్కారాలను ఐపీఎస్‌ శిక్షణార్థులకు వివరించే ఏర్పాటు చేస్తా' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చైనా సరిహద్దులో బలగాల కొనసాగింపునకు సన్నాహాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.