దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 9మందికి కరోనా సోకింది. దీంతో భారత్లో కరోనా బాధితుల సంఖ్య 56కు చేరింది. కేరళలో తాజాగా ఆరుగురికి వ్యాధి నిర్ధరణ అయినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 15కు చేరింది. కర్ణాటకలో తాజాగా పెరిగిన మూడు కేసులతో అక్కడ కరోనా సోకిన వారు నలుగురికి పెరిగారు.
కేరళలో..
ఇటలీ నుంచి భారత్కు వచ్చిన ముగ్గురికి ఈ మహమ్మారి సోకినట్లు సమాచారం. అదే సమయంలో వారిని కలిసిన మరో 8మందికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇటలీలో పర్యటించి స్వదేశానికి చేరుకున్న వారిలో ఓ చిన్నారికి వ్యాధి ఉన్నట్లు సోమవారం నిర్ధరణ అయింది. చిన్నారి తల్లిదండ్రులకు కరోనా ఉందా అనే అంశమై వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేరళలో మొత్తంగా 149మందిని వివిధ ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచారు. 1116మందిని పరిశీలిస్తున్నారు. కరోనా భయాలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే పరీక్షల వార్షిక పరీక్షల నిర్వహణ కొనసాగుతుందని వెల్లడించారు అధికారులు.
ఇదీ చూడండి: కబళిస్తున్న కరోనా.. చదువులకు ఆటంకం