మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొఖడ, త్రయంబకేశ్వర్ గ్రామాల మధ్య ఉన్న టొరంగేన్ ఘాట్ వద్ద ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను త్రయంబకేశ్వర్లోని ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.