ETV Bharat / bharat

విద్యుత్​ తీగకు బస్సు తాకి ఆరుగురు మృతి

రాజస్థాన్​లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్​ రూపంలో ఎదురైన మృత్యువు వీరిని బలి తీసుకుంది.

rajasthan bus short circuit
రాజస్థాన్​లో బస్సు ప్రమాదం.. ఆరుగరి మృతి
author img

By

Published : Jan 17, 2021, 3:48 AM IST

Updated : Jan 18, 2021, 8:22 AM IST

రాజస్థాన్​లోని జలోర్ జిల్లా మహేష్​పురా​లో భక్తులతో ప్రయాణిస్తున్న బస్సు విద్యుదాఘాాతానికి గురైంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి.

bus-caught-fire-after-coming-in-contact-with-electric-wire
విద్యుత్​ తీగకు బస్సు తాకి ఆరుగురు మృతి
bus-caught-fire-after-coming-in-contact-with-electric-wire
కాలిపోయిన బస్సు

జలోర్ తాలూకా మహేష్‌పురా గ్రామంలోకి ప్రవేశించగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని.. ఫలితంగా వేలాడుతున్న విద్యుత్​ తీగను బస్సు తాకి మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రైవేటు బస్సు బార్మెర్ నుంచి భక్తులతో అజ్మీర్‌లోని బేవార్‌కు బయలుదేరిందని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ హిమ్మత్ సింగ్ తెలిపారు.

ప్రమాదం జరిగిన బస్సు..

ప్రమాద దృశ్యాలు..

గాయపడిన వారిని జోధ్​పుర్ ఆస్పత్రికి తరలించామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జలోర్ జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి: ఒకరి అతివేగం.. తీసింది ఇద్దరి ప్రాణం

Last Updated : Jan 18, 2021, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.