ETV Bharat / bharat

కరోనాతో ముంబయి కళావిహీనం- పునర్వైభవం ఎప్పటికి? - కరోనా వైరస్ వార్తలు

"ది సిటీ దట్‌ నెవర్‌ స్లీప్స్‌"... నిద్రించని మహా నగరం ముంబయి. ఆర్థిక కార్యకలాపాలు ఆ స్థాయిలో ఉంటాయి అక్కడ. నగరంలోని దాదాపు అన్ని విభాగాలు అన్నివేళలా తెరిచే ఉంటాయి. ఇలాంటి గొప్ప నగరం, అది ఉన్న మహారాష్ట్ర ఇప్పుడు కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. కానీ... ఈ పరిస్థితి ఎంత కాలం? కరోనా దెబ్బ నుంచి ముంబయి కోలుకుంటుందా? ప్రభుత్వ నివారణ చర్యలు ఉపశమనం కలిగిస్తాయా? దేశంలోనే కరోనాకు ముంబయి కేంద్రబిందువుగా మారనుందా?

CORONA_MUMBAI
కరోనాతో ముంబై కళావిహీనం
author img

By

Published : Apr 2, 2020, 3:31 PM IST

దేశంలోనే అత్యధిక జనసాంద్రత గల నగరాల్లో ముంబయి ఒకటి. దేశ ఆర్థిక రాజధాని. ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో పాటు.. పొట్టచేత బట్టుకుని వచ్చే... గంపెడు ఆశలు మోసుకుని వచ్చే మరెంతోమందికి అదే గమ్యస్థానం.

ఈ జనసమ్మర్థ నగరాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రంగా కలవర పెడుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 మహరాష్ట్రలో, ముఖ్యంగా ముంబయి మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న తీరే అందుకు కారణం. ఈ నెల 9వ తేదీన అక్కడ మొదటి కరోనా కేసు వెలుగు చూసింది.

జనసాంద్రత అధికం..

చైనాలో 1 చదరపు కిలోమీటర్‌కు 148 జససాంద్రత ఉంటే భారత్‌లో అది 420 అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముంబయి నగరంలో అయితే 2,463 జనసాంద్రత ఉంది. అందుకే ఎప్పుడూ కిక్కిరిసి కనిపిస్తుంటుందీ నగరం.

ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ ధారావి... ముంబయిలోనే ఉంది. దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చితే వచ్చి పోయే విదేశీయుల సంఖ్య ఎంతో ఎక్కువ. ఈ కారణాలన్నీ ఒకదానికి మరొకటి తోడై... అక్కడ కరోనా కేసుల్ని పెంచేస్తున్నాయి.

ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉండడం సానుకూలాంశమే. అయినా, దేశవ్యాప్తంగా చూస్తే అతి వేగంగా, 20% పైగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం ముంబయి, పుణె, నాగపుర్ లాంటి నగరాలకే పరిమితమైన కరోనా... గ్రామాలకూ విస్తరిస్తే పరిస్థితి ఏంటా అని? వైద్య నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు..

కరోనా వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీని కంటే ముందే పలు రాష్ట్రప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో నిర్భంధాలు ప్రకటించాయి. అందులో మెుదటగా మహారాష్ట్రలోనే 144 సెక్షన్ విధించారు. వైరస్‌ తీవ్రతను ముందే అంచనా వేసిన ఉద్ధవ్​ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. 50% మేర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది.

ప్రైవేటు కార్యకలాపాలు దాదాపు నిలిచిపోగా... కొన్ని అత్యవసర విభాగాలు మాత్రమే పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లాల సరిహద్దులు మూసివేశారు. ప్రభుత్వ , ప్రైవేటు రవాణా రద్దు చేశారు. అత్యవసర వాహనాలు మినహా ఏ వాహనాలను రోడ్లపైకి రానివ్వట్లేదు.

లాక్‌డౌన్‌ కారణంగా నిరాశ్రయులైన వలస కూలీలను ఆదుకునేలా... రాష్ట్రవ్యాప్తంగా 163 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం గూమికూడకుండా.. ఆ షాపులు 24 గంటల పాటు తెరిచి ఉంచేలా ఆదేశాలిచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో కరోనాపై వదంతుల కట్టడిలో భాగంగా పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్న వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

పుణె పరీక్ష కేంద్రం..

మొదట్లో కరోనా నిర్ధరణ కేంద్రం ఒక్క పుణెలోనే ఉంది. ఇటీవల కొన్ని ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనే కరోనా నిర్ధరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా, పుణెలోని 3 నిర్ధరణ కేంద్రాలపై భారం తగ్గింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న వేళ... వాటి మీద ప్రభావం పడకుండా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు సైతం నిర్ధరణ పరీక్షలకు అనుమతినిచ్చారు.

మహారాష్ట్రలోనే కాదు దేశమంతా ప్రస్తుతం కరోనా అనుమానితులకే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాలా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తే ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశముందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కార్పొరేట్ల సహకారం..

దేశానికి ఆర్థిక రాజధాని కావడం వల్ల ముంబయిలో నిత్యం కొన్ని వేల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ఒక్క సేవా రంగంలోనే రోజుకు 500 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది.‌ అయినా కొన్ని పెద్ద సంస్థలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని... కరోనా కట్టడిలో తమ వంతు సహాయం చేస్తున్నాయి.

రిలయన్స్‌ సంస్థ ముంబయిలోని తమ హోటల్‌ను వంద పడకల ఐసోలేషన్‌ వార్డుగా మార్చింది. టాటా గ్రూప్ కరోనా కట్టడికి 500 కోట్లు ఖర్చు చేయనుంది. మహీంద్ర సంస్థ అతి తక్కువ ధరకే వెంటిలేటర్లు తయారు చేసే పనిలో నిమగ్నమైంది.

భారీగా విదేశీయులు..

దేశంలోనే అత్యంత రద్దీ గల ఎయిర్​పోర్టుల్లో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ప్రపంచలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలకు కేంద్రం కావడం వల్ల... నిత్యం వేలాది మంది విదేశాల నుంచి ముంబయికి వస్తుంటారు. వీరు స్థానికులను కలుస్తుండటం సాధారణమే. ఫలితంగా కరోనా 3వ దశలోకి వ్యాపించే అవకాశం అన్నిరాష్ట్రాల కంటే మహారాష్ట్రకే ఎక్కువ ఉంది.

ఈ నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులపై అధ్యయనం చేస్తోంది రాష్ట్రప్రభుత్వం. అక్కడి నగరాలలో వైద్యసేవలు అందుబాటులో ఉన్నా... మిగతా ప్రాంతాల్లో ఈ తరహా వసతులు లేవు. అందుకే వైరస్‌ గ్రామాలకు విస్తరించకుండా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.

3వ దశకు చేరుకుంటుందా?

కేంద్రం సూచనలతో అధికారులను సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఊరటనిచ్చే విషయమేంటంటే విదేశాల నుంచి వచ్చిన వారితో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో వారికే వైరస్‌ సోకింది.

చూస్తుండగానే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు వేలకు చేరువయ్యాయి. పక్క దేశాలతో పోల్చితే ఇది తక్కవే అయినా... కరోనా 3వ దశలోకి దూకడానికి సిద్ధంగా ఉందన్న వార్త కలవరపెడుతోంది. అదే కనుక జరిగితే, కరోనాకు ముంబయి పరిస్థితి ఏమిటనేదే అందరి ఆందోళన.

ఇదీ చూడండి: ఒక్క వ్యక్తి పొరపాటుతో 17 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.