ETV Bharat / bharat

సీబీఐ వివాదంపై మాటల యుద్ధం - SUPREME

సీబీఐ-బంగాల్​ వివాదంపై ప్రతిపక్షాలు లోక్​సభను హోరెత్తించాయి. ఈ అంశంపై ప్రభుత్వం-విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాల నిరనసల మధ్య సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

లోక్​సభలో పేలిన మాటల తూటాలు
author img

By

Published : Feb 4, 2019, 2:15 PM IST

కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ముక్తకంఠంతో నినదించాయి. లోక్​సభ ప్రారంభమైనప్పటి నుంచి సీబీఐ, కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభాపతి ఎన్నిసార్లు వారించినప్పటికీ సభ్యులు లెక్కచేయలేదు.

విపక్షాలు లేకుండా చేయాలనే: ఖర్గే

సీబీఐ వ్యవహారంపై కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. విపక్షాలను అంతం చేయడానికే కేంద్రం సీబీఐని వినియోగిస్తోందని దుయ్యబట్టారు.

లోక్​సభలో పేలిన మాటల తూటాలు
undefined

"ఈ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను మట్టుపెట్టి నిరంకుశ ప్రభుత్వాని నడపొచ్చని చూస్తున్నారు. బంగాల్​లో వారి ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. అర్ధరాత్రి వెళ్లి పోలీసు అధికారిని అరెస్ట్​ చేయడానికి ప్రయత్నించారు. ఒక్క పోలీసు అధికారిని అరెస్ట్​ చేయడానికి 40 మంది అధికారులు వెళ్లడం ఏంటి? దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? బంగాల్​లోనే కాదు, ఉత్తర్​ప్రదేశ్​, కర్ణాటక, చెన్నైలోనూ ఇదే రీతిలో వ్యహరించారు. రాజ్యాంగ సంస్థలను ప్రజలకు ఉపయోగపడేలా కాకుండా ప్రతిపక్షాలను నాశనం చేయడానికి వినియోగిస్తోంది కేంద్రం. " - మల్లికార్జున్​ ఖర్గే, లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేత

రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారు: రాజ్​నాథ్​

ఖర్గే సహా విపక్ష సభ్యుల వ్యాఖ్యలను రాజ్​నాథ్​ తప్పుబట్టారు. సీబీఐని పని చేసుకోకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే దర్యాప్తు జరుగుతుందని వివరించారు.

లోక్​సభలో పేలిన మాటల తూటాలు
undefined

"నిన్న కోల్​కతాలో సీబీఐ అధికారులు చట్టపరంగా విధులు నిర్వర్తించడానికి వెళితే వారిని అదుపులోకి తీసుకొన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరిగి ఉండదని నేను భావిస్తున్నా. సుప్రీంకోర్టు సీబీఐకి ఈ కేసు దర్యాప్తునకు పూర్తి అనుమతినిచ్చింది. వారిని అడ్డుకొని దేశంలో ఫెడరల్​, రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. పూర్తిగా దేశంలో దర్యాప్తు సంస్థలు వాటి విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అవసరం. ప్రభుత్వం అదే చేస్తోంది. పశ్చిమ బంగ ప్రభుత్వం సీబీఐకి సహకరించాల్సిందే." - రాజ్​నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి

దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సాధారణ పరిస్థితులు ఉండేలా చూసేందుకు కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని రాజ్​నాథ్​ గుర్తుచేశారు.

New Delhi, Feb 04 (ANI): After the CBI face off in Kolkata on Sunday which led to West Bengal Chief Minister Mamata Banerjee sitting on a dharna, almost entire opposition rallied behind the TMC chief. National Conference leader Farooq Abdullah termed Banerjee's allegation "right" and said the country is in "danger". Congress senior leader Ghulam Nabi Azad also supported Banerjee and said the BJP is hell bent on "eliminating" opposition parties. Shiv Sena leader Sanjay Raut also gave soft support to Banerjee by saying if the latter is sitting on a dharna than it is a "serious" matter, and that if CBI is being misused then it's a "matter of dignity of the nation".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.