సామాజిక మధ్యమాల ద్వారా ప్రేమ జంటలు ఒక్కటవ్వడమే కాదు.. ఎన్నో ఏళ్ల క్రితం తప్పిపోయిన బంధువులు కూడా కలుసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని రాయ్‌సింగ్ నగర్లో చోటుచేసుకుంది. ఫేస్బుక్ సహాయంతో రంజిత్ సింగ్.. 72 ఏళ్ల తర్వాత తన చెల్లెల్ని కలుసుకున్నారు.
1947లో విడిపోయిన కుటుంబం...
1947లో కశ్మీర్ గిరిజన చొరబాట్ల జరిగాయి. ఆ గొడవల గందరగోళంలో రంజిత్ సింగ్ కుటుంబం విడిపోయింది. రంజిత్ తాత మత్వాల్ సింగ్, తన కుటుంబంతో కలిసి భారత్‌లో ఉండగా.. ఆయన 4ఏళ్ల సోదరి భజ్జో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.
ఇటీవలే.. రచయిత, సామాజిక కార్యకర్త రోమి శర్మ నిర్వహించిన సోషల్ మీడియా గ్రూప్ సాయంతో రంజిత్ తన సోదరి సమాచారం తెలుసుకున్నారు. 72ఏళ్ల అనంతరం ఇరువురు వీడియో కాల్ మాట్లాడుకున్నారు.
"మా సోదరి వివరాలతో కూడిన వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ఉంచాం. ఆమెను కలిసేందుకు చాలా రకాలుగా ప్రయాత్నాలు చేశాం. కానీ సఫలం కాలేకపోయాము. ఇప్పుడు ఎట్టకేలకు నా సోదరిని కలవడం సాధ్యమైంది. నాలుగేళ్ల వయసులో ఆమె నా నుంచి విడిపోయింది. 72ఏళ్లు గడిచిన అనంతరం సామాజిక మాధ్యమాల వల్ల ఇప్పుడు కలుసుకోగలిగాం."
-రంజిత్ సింగ్.
ప్రస్తుతం తన సోదరి పేరు సకీనాగా మారిందని, ఆమె ఓ షేక్‌తో వివాహం కూడా చేసుకుందని తెలుసుకున్నారు రంజిత్. నలుగురు పిల్లల తల్లిగా జీవితాన్ని గడుపుతున్న తన సోదరిని చూసి ఎంతో సంతోషించారు రంజిత్. త్వరలోనే ఈ రెండు కుటుంబాలు కర్తార్‌పుర్ నడవాలో కలవనున్నాయి.
ఇదీ చూడండి:మొహర్రం దృష్ట్యా కశ్మీర్లో మళ్లీ ఆంక్షలు..!