దేశ రాజధానిలో పోలీసుల కొరత ఉందని కేంద్ర హోంశాఖకు దిల్లీ పోలీసు శాఖ నివేదించింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్... దిల్లీలో జరుగుతున్న అల్లర్లను తక్షణమే నియంత్రించేందుకు సరిపడా సిబ్బంది లేరని తెలిపారు.
సిబ్బంది లేని కారణంగానే పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ హింస చెలరేగిన ప్రాంతాల్లో ఒక బెటాలియన్ సాయుధ బలగాలను మోహరించామని ఒక అధికారి తెలిపారు.
"దిల్లీ పోలీసులకు 35 పారామిలిటరీ బలగాలను ఇచ్చారు. ఇందులో 20 కంపెనీలను అమెరికా అధ్యక్షుడి పర్యటనకే వినియోగించారు."
-సీనియర్ అధికారి
ఈశాన్య దిల్లీలో ఆదివారం పౌర నిరసనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ అల్లర్లలో ఒక హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తం 9 మంది మృతి చెందారు. మరో 160 మందికిపైగా గాయపడ్డారు. ఇవాళ కూడా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: పౌర సెగ: రణరంగంలా దిల్లీ- 10 మంది మృతి