ETV Bharat / bharat

బిహార్​ ఎన్నికల బరిలో శివసేన!

బిహార్​ ఎన్నికల్లో 30-40 సీట్లల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్టు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ వెల్లడించారు. దీనిపై త్వరలో ఓ స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు.

Shiv Sena may contest 30-40 seats in Bihar: Sanjay Raut
బిహార్​ ఎన్నికల బరిలో శివసేన!
author img

By

Published : Oct 5, 2020, 10:04 PM IST

రానున్న బిహార్​ ఎన్నికల్లో శివసేన బరిలో దిగే అవకాశముంది. 30-40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే యోచనలో శివసేన ఉన్నట్టు ఆ పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​ వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

"50 సీట్లల్లో పోటీ చేయాలని మా ప్రజలు కోరుతున్నారు. కానీ మేము 30-40 స్థానాల్లో బరిలో దిగాలని అనుకుంటున్నాం."

--- సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ.

'మాజీ డీజీజీ గుప్తేశ్వర్​ పాండేపై పోటీ చేస్తారా?' అన్న ప్రశ్నకు... 'వేచి చూడండి' అంటూ జవాబు చెప్పారు రౌత్​. త్వరలో తాను బిహార్​కు వెళతానని, ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం అక్కడే చెబుతానని పేర్కొన్నారు.

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుట్​ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని పాండే డిమాండ్​ చేశారు. అప్పటి నుంచి పాండేను శివసేన లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధిస్తోంది.

గత నెలలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన పాండే.. ఆ తర్వాత జేడీయూలో చేరారు.

ఇదీ చూడండి:- 'బిహార్​లో ఎన్​డీఏ గెలుపునకు అసలు కారణం ఆర్​జేడీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.