ETV Bharat / bharat

దిల్లీలో కరోనా కట్టడికి షా 'ఆపరేషన్ ఐఏఎస్​' - Shah-Kejriwal meeting latest news

దిల్లీలో కరోనా వ్యాప్తి నివారణకై కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అండమాన్ నికోబార్​, అరుణాచల్​ ప్రదేశ్​లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఐఏఎస్​ అధికారులను తక్షణమే దిల్లీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు కేంద్రం నుంచి మరో ఇద్దరు సీనియర్​ ఐఏఎస్​ అధికారులనూ రంగంలోకి దింపారు.

Shah transfers 4 IAS officers to Delhi govt to assist COVID-19 fight
దిల్లీలో కరోనా కట్టడికి షా 'ఆపరేషన్ ఐఏఎస్​'
author img

By

Published : Jun 14, 2020, 4:51 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం అండమాన్ నికోబార్​, అరుణాచల్​ ప్రదేశ్​లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఐఏఎస్​ అధికారులను తక్షణమే దిల్లీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. వీరితో పాటు కరోనా నియంత్రణ చర్యల్లో కేజ్రీవాల్​ ప్రభుత్వానికి సాయం చేయడానికి కేంద్రం నుంచి మరో ఇద్దరు ఐఏఎస్​ అధికారులనూ పంపుతున్నట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్​, లెఫ్టి​నెంట్​ గవర్నర్​ అనిల్​ బైజల్​తో కలిసి దిల్లీలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన గంటల వ్యవధిలో ఈ నిర్ణయం తీసుకున్నారు షా.

" అండమాన్​ నికోబార్​ దీవుల్లో విధులు నిర్వర్తిస్తున్న అవానిష్​ కుమార్​, మోనికా ప్రియదర్శిని, అరుణాచల్​ ప్రదేశ్​లో పనిచేస్తున్న గౌరవ్​ సింగ్​ రావత్​, విక్రమ్​ సింగ్​ మాలిక్​ను తక్షణమే దిల్లీకి బదిలీ చేయాలని.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆదేశించారు. వీరితో పాటు ఎస్​సీఎల్​ దాస్​, ఎస్​ఎస్​ యాదవ్​ అనే మరో ఇద్దరు సీనియర్​ ఐఏఎస్​ అధికారులను కూడా కేజ్రీవాల్​ సర్కారుకు తోడ్పాటు అందించేందుకు నియమించారు."

- కేంద్ర హోంశాఖ అధికారి ప్రతినిధి

39 వేల కేసులు

దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు 39 వేలకు చేరుకుంది. ఇప్పటి వరకు 1200 మందికిపైగా కొవిడ్​-19తో ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.