జమ్ముకశ్మీరు పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తర దళాల ఆర్మీ కమాండర్, డీజీపీ, నిఘా సంస్థల అధికారులు, పారామిలిటరీ దళాలతో సమావేశమయ్యారు.
జూన్ 12న జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన అనంతనాగ్ ఇన్‌స్పెక్టర్ అర్షద్‌ఖాన్ కుటుంబాన్ని అమిత్‌షా పరామర్శించారు. అర్షద్ ఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రొటోకాల్ కాకున్నా...
రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ సలహాదార్లు సహా ఉన్నత స్థాయి అధికారులు అమిత్ షాకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి తరలి వెళ్లారు. సాధారణంగా ఇప్పటివరకు గవర్నర్లు ప్రధానమంత్రికి మాత్రమే స్వాగతం పలికేవారు.
- ఇదీ చూడండి: పైలట్ చాకచక్యంతో తప్పిన 'పక్షి రాజు' ముప్పు