భాజపా జాతీయాధ్యక్షుడు లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. 1998 నుంచి గాంధీనగర్‌లో ఓటమంటూ ఎరుగని ఎల్కే అడ్వాణీ స్థానంలో ఈసారి అమిత్ షా బరిలో దిగుతున్నారు.
దారి పొడవునా మద్దతు...
నామపత్రాలు దాఖల చేయడానికి బయలుదేరే ముందు అర్చకుల ఆశీర్వాదాలు పొందారు అమిత్ షా. అనంతరం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత భాజపా విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన షా... దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న అంశంపైనే ఈసారి ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్నారు.
రోడ్ షోతో నామపత్రాల దాఖలుకు ఊరేగింపుగా వెళ్లారు షా. దారి పొడవునా భాజపా నినాదాలు, జెండాలతో ప్రజలు పార్టీ అధ్యక్షుడికి మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి:అంతరిక్షంలోనూ భారత్‌కు చౌకీదార్: మోదీ