ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒడిశా గంజాం నుంచి.. గుజరాత్‌లోని సూరత్‌కు కార్మికులతో వెళ్తున్న బస్సు రాయ్‌పుర్‌లోని ఛేరి ఖేడీ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో 20 మందికిపైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు.. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
తలో రూ. 2లక్షలు..
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.