తమ వద్ద కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయన్న వార్తలపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) స్పందించింది. ఆ వార్తలన్నీ అసత్యమని స్పష్టం చేసింది. టీకాను తయారు చేసి భవిష్యత్తు ఉపయోగాల కోసం వాటిని భద్రపరిచేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చిందని పేర్కొంది.
ట్రయల్స్ విజయవంతమై, నిబంధనల ప్రకారం ఆమోదముద్ర లభించిన తర్వాతే కొవిషీల్డ్‌ను వాణిజ్యపరంగా ఉపయోగిస్తామని ఎస్ఐఐ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశలో ఉందని.. వైరస్‌ను అది నిరోధించగలదని తేలినప్పుడే దాని లభ్యతపై అధికారికంగా ప్రకటన చేస్తామని తెలిపింది ఎస్ఐఐ.
ఇదీ చూడండి:- కరోనా టీకాపై రెండు, మూడో దశ పరీక్షలు షురూ