ETV Bharat / bharat

పరువు నష్టం కేసులతో రాహుల్​ బిజీబిజీ - మోదీ

దేశవ్యాప్తంగా తనపై నమోదైన పరువునష్టం కేసులతో... రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ బిజీబీజీగా గడపనున్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను రాహుల్ కించపరిచారంటూ, తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ పలు రాష్ట్రాల్లో భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేతలు ఈ కేసులు దాఖలు చేశారు.

పరువు నష్టం కేసులతో రాహుల్​ బిజీబిజీ
author img

By

Published : Jul 4, 2019, 4:46 PM IST

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీని... పరువు నష్టం కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తనపై నమోదైన పరువు నష్టం కేసుల్లో... విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది.

గురువారం ముంబయి కోర్టు ముందు హాజరయ్యారు రాహుల్. పాత్రికేయురాలు గౌరీలంకేష్​ హత్య సమయంలో... రాహుల్ భాజపా-ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలపై విమర్శలు గుప్పించారు. దీనిపై సంఘ్ కార్యకర్త, న్యాయవాది జోషి పరువునష్టం కేసు వేశారు.

కోర్టు విచారణకు హాజరైన రాహుల్​ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం రూ.15వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. విచారణ సమయంలో రాహుల్ హాజరుపై మినహాయింపు నిచ్చింది.

థానేలో...

మహాత్మా గాంధీ హత్యకు ఆర్​ఎస్​ఎస్​ కారణమంటూ రాహుల్​గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. థానే జిల్లాలోని బివాండీలో ఓ స్థానిక ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త పరువు నష్టం కేసు వేశారు.

గతేడాది జూన్​లో ఈ కేసు విచారణ కోసం బివాండీ కోర్టు ముందు హాజరైన రాహుల్​... తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. అయితే న్యాయస్థానం ఆయనపై ఐపీసీ సెక్షన్ 499, సెక్షన్​ 500ల కింద పరువునష్టం కేసులు నమోదు చేసింది. ఇవి కూడా త్వరలో విచారణకు రానున్నాయి.

బిహార్... గుజరాత్​ల్లోనూ...

సార్వత్రిక ఎన్నికల సమయంలో భాజపా-ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలపై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిహార్, పంజాబ్​ల్లోనూ రాహుల్​పై పరువునష్టం కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక కోలార్​లో ఏప్రిల్​ 13న లోక్​సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాహుల్ భాజపా-ఆర్​ఎస్​ఎస్​పై విమర్శలు గుప్పించారు. నీరవ్​ మోదీ, లతిత్ మోదీ, నరేంద్ర మోదీ... దొంగల పేర్ల వెనుక 'మోదీ' అనే పేరు ఎందుకు కామన్​గా ఉంటుందని రాహుల్ అన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై భాజపా నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ ఏప్రిల్​ 18న పట్నా కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసు జూలై 6న పట్నా కోర్టులో విచారణకు రానుంది. దీనికీ రాహుల్ హాజరుకావాల్సి ఉంది.

అలాగే గుజరాత్​లోని అహ్మదాబాద్, సూరత్​ కోర్టుల్లో నమోదైన పరువునష్టం కేసు విచారణలకూ రాహుల్ హాజరుకావాల్సి ఉంది.

ఇదీ చూడండి: ట్వీట్​తోనే పర్యటకుల సమస్యల పరిష్కారం!

New Delhi, July 04 (ANI): While addressing the press conference in Delhi on Thursday, Chief Economic Advisor KV Subramanian on Economic Survey 2018-19 said, "In an uncertain world in which we all work, there are 3 key elements critical for ensuring that policies really help in reaching common person. 1st, a vision that has already been provided by the PM,of a 5 trillion dollar economy by 2024-25. To achieve that vision, a strategic blueprint is necessary. This year Economic Survey makes a concerted effort to try and provide that blueprint. For achieving vision laid down by the PM. 3rd key elements are tactical tools necessary to calibrate into this blueprint."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.