సీనియర్ పాత్రికేయుడు, భాజపా మాజీ ఎంపీ అశ్వినీ చోప్రా కన్నుమూశారు. హరియాణాలోని గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాన్సర్‌కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
దిల్లీ కేంద్రంగా వెలువడే పంజాబ్ కేసరి పత్రికలో ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన హరియాణాలోని కర్నాల్ నియోజకవర్గం నుంచి 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. యువకుడిగా ఉన్న సమయంలో మిన్నా అనే పేరుతో క్రికెటర్‌గా గుర్తింపు పొందారు చోప్రా.
ప్రముఖుల సంతాపం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు అశ్వినీ చోప్రా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
అశ్వినీ చోప్రా మీడియా ప్రపంచానికి చేసిన సేవలు ఎన్నటికి మరువలేనివని ట్వీట్ చేశారు మోదీ. ప్రజాప్రతినిధిగా చాలా చక్కగా పని చేశారని వ్యాఖ్యానించారు.
ఎడిటర్‌గా అశ్వినీ చోప్రా సుదీర్ఘ ఉద్యోగ జీవితం, ప్రజాప్రతినిధిగా అందించిన సేవలు ఎన్నటికి మరువలేనివని పేర్కొన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. రాజకీయాలకు అతీతంగా చోప్రాకు మిత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌లో మొబైల్ సేవల పునరుద్ధరణ