మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివాజీరావు పాటిల్ నీలంగేకర్ బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ మధ్యకాలంలో కరోనా బారినపడిన 91 ఏళ్ల శివాజీరావు.. వైరస్ను జయించి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అయితే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున కన్నుమూశారు.
ఇదీ ఆయన ప్రస్థానం..
శివాజీరావు పాటిల్ 1931 ఫిబ్రవరి 9న జన్మించారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన శివాజీరావు.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి దాదాసాహెబ్గా పేరుగాంచారు. కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన ఆయన.. రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ పదవులు చేపట్టారు. ఆ తర్వాత 1985 జూన్ 3 నుంచి 1986 మార్చి 6 వరకు 9 నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు.
ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్‌లో కొత్త కాంతులు.. అభివృద్ధి దిశగా అడుగులు