బంగాల్లోని కోల్‌కతా హైకోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బాంబు బెదిరింపు లేఖ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన కోర్టు భవనంలోని పలు ప్రదేశాల్లో పేలుళ్లకు పాల్పడతామని ఈ నెల 9న కోర్టు రిజిస్ట్రార్‌కు బెదిరింపు లేఖ వచ్చింది.
ఓ వ్యక్తి పేరిట బెదిరింపు లేఖ రాసిన ఆగంతకులు.. తన కొడుకుతో కలిసి కోర్టు ప్రాంగణంలో పలు చోట్ల బాంబు దాడులు చేస్తామని అందులో పేర్కొన్నారు. లేఖ విషయమై కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తెలియజేసినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. బెదిరింపుల నేపథ్యంలోనే కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రోజూ వేల సంఖ్యలో ఫిర్యాదుదారులు, న్యాయవాదులు కోల్‌కతా హైకోర్టుకు వస్తుంటారు.
- ఇదీ చూడండి: ప్రపంచ సాంకేతిక పోటీతత్వ జాబితాలో భారత్@44