ETV Bharat / bharat

'నితీశ్​ చేతుల్లోనే బిహార్​ క్షేమం' - గయాలో భాజపా ఎన్నికల ర్యాలీ

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్వర్యంలోనే బిహార్​ క్షేమంగా ఉందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గయాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన... అభివృద్ధి మంత్రంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Bihar polls_nadda
'నితీశ్​ కుమార్​ చేతుల్లోనే బిహార్​ క్షేమం'
author img

By

Published : Oct 11, 2020, 6:09 PM IST

కరోనా విజృంభణ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నితీశ్​ ప్రభుత్వం బిహార్ ప్రజల సంక్షేమం కోసం పనిచేసిందని కొనియాడారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయన చేతిలోనే కొనసాగేలా చూడాలని అక్కడి ప్రజలను కోరారు.

గయాలోని గాంధీ మైదాన్​లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు నడ్డా. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేశారు.

" ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం క్షేమంగా ఉంది. అలాగే బిహార్​ క్షేమంగా ఉంది నితీశ్ నేతృత్వంలోనే".

--జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

మరో 11 వైద్య కళాశాలలు

గత ఆరేళ్లలో బిహార్​లో 14 వైద్య కళాశాలలు నిర్మించామని చెప్పారు జేపీ నడ్డా. మరో 11 కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. బిహార్​ను అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:బిహార్​ బరి: ప్రజలపై నితీశ్​ హామీల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.