ETV Bharat / bharat

భారత్​ చేరిన మోదీ రెండో 'ప్రత్యేక' విమానం - ఎయిర్​ ఇండియా వన్​ రెండో విమానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు వీవీఐపీల కోసం వినియోగించే రెండో ప్రత్యేక విమానం.. ఎయిర్​ఇండియా వన్​ భారత్​ చేరింది. ఇవాళ ఉదయం దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్​ అయింది. ఈ విమానాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

Vvip aircraft
ఎయిర్​ఇండియా వన్​
author img

By

Published : Oct 25, 2020, 11:09 AM IST

Updated : Oct 25, 2020, 11:37 AM IST

భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా వీవీఐపీల కోసం ఉపయోగించే.. ఖరీదైన, ప్రత్యేక బోయింగ్​ 777 రెండో విమానం భారత్​ చేరింది. ఎయిర్​ ఇండియా వన్‌గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం దిల్లీలో ల్యాండ్​ అయింది.

ఈనెల ఒకటిన తొలి ఎయిరిండియా వన్‌ విమానం.. భారత్‌కు చేరింది. ఇందులో అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. గగనతలంలో ఎలాంటి ఆటంకాలు, హ్యాకింగ్‌ బెడద లేకుండా ఆడియో, వీడియా సమాచార వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. జంబో విమానం బోయింగ్‌ బి-747ను బి-777గా మార్చి ఎయిరిండియా వన్‌ విమానాన్ని తయారుచేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను వాయుసేనకు అప్పగించారు.

ఇవీ చూడండి: మోదీ కోసం కొత్త విమానం- ప్రత్యేకతలు ఇవే...

మోదీ విమానాన్ని మిసైల్స్​ కూడా ఢీకొట్టలేవా..?

Last Updated : Oct 25, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.