ETV Bharat / bharat

లాక్​డౌన్​లో మీరు ఈ ఆటలు ఆడుతున్నారా..?

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్​డౌన్​లో ఉంది. ఈ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రత్యర్థులుగా మారి యుద్ధాలు చేస్తున్నారు. గెలుపోటములు ఏవైనా రంగంలోకి దిగడానికి సై అంటున్నారు. ఏంటండీ ఏదో సీరియస్​గా సాగుతోంది కథనం అనుకుంటున్నారా? ఇవన్నీ చేస్తున్నది ఆటలో భాగంగానే మరి. అసలు కథేంటో చదివేయండి.

lockdown games
లాక్డౌన్ గేమ్స్
author img

By

Published : Apr 5, 2020, 12:51 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ మొత్తం లాక్​డౌన్​లో కాలం గడుపుతోంది. రోజులో 24 గంటలు ఇంట్లోనే ఉండటం వల్ల ఒకరితో ఒకరు సమయాన్ని గడిపేందుకు కుటుంబాలు పాత పంథాను ఎంచుకున్నాయి. ఇంటర్నెట్​లో షార్ట్ ఫిలింస్, టీవీ షోస్, పుస్తకాలు చదవడం అలవాటు ఉన్న ఈ తరానికి మళ్లీ నాటి క్లాసిక్ గేమ్స్ రుచి చూపిస్తున్నారు పెద్దలు.

గంటల తరబడి కుటుంబ సభ్యులు చదరంగంపై యుద్ధం చేస్తున్నారు. రాణిని సొంతం చేసుకోవడానికి క్యారంబోర్డుపై కుస్తీలు పడుతున్నారు. లాక్ డౌన్ సమయం అంతా విసుగ్గా గడపకుండా కొత్త మార్గాల్లో చిన్నచిన్న ఆనందాలను వెతుక్కుంటున్నారు.

ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ పదాలను రూపొందించే స్క్రాబుల్ గేమ్, చైనీస్ చెకర్, క్యారంబోర్డ్, చెస్, జిగ్సావోతోపాటు ఆన్ లైన్ లో ఆడే స్క్రిబుల్, డూమ్ ఎటర్నల్ వంటి యాక్షన్ గేమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అటకమీద ఉన్న వైకుంఠపాళీ(పాము నిచ్చెన) పటాల దుమ్ము దులుపుతున్నారు. నిత్యావసరాలు అమ్మే దుకాణాల్లోనూ వీటి కొనుగోలుకు ఎగబడుతున్నారు.

"లూడో గేమ్ బోర్డులు నా దుకాణంలోని ఓ మూలన చాలా పడి ఉండేవి. కానీ లాక్​డౌన్​ ప్రకటించిన తర్వాత నిత్యావసరాలు కొనుక్కునేవారు వచ్చి లూడో సెట్లను కొనుక్కెళ్తున్నారు. ఇప్పుడు అవన్నీ అమ్ముడైపోయాయి."-దిల్లీలోని ఓ దుకాణదారుడు

అప్పటి కాలంలోనూ ప్రాచుర్యం పొందిన లూడో.. ఆన్​లైన్​ వెర్షన్ వచ్చిన తర్వాత ఇప్పటి యువతకూ సుపరిచితంగా మారిపోయింది. వీటన్నింటినీ ఆడుకుంటూ ఇంట్లోని సమయాన్ని చిన్నాపెద్దా తేడా లేకుండా ఆహ్లాదంగా గడుపుతున్నారు. క్యారం బోర్డులు ఎక్కువగా ఆడటం వల్ల లఖ్​నవూలోని దుకాణాల్లో కాయిన్స్, బోరిక్ పౌడర్ కోసం డిమాండ్ పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇక ఆన్​లైన్​ గేమ్స్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. లాక్ డౌన్ ఉన్నా లేకున్నా వీటికున్న క్రేజే వేరు. పబ్జీ, క్లాష్ ఆఫ్ క్లాన్స్, టెంపుల్ రన్, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్స్ వంటి గేమ్స్ పట్ల యువత అత్యంత ఆకర్షితులు అవుతున్నారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో 601మందికి కరోనా.. 12మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.