ETV Bharat / bharat

షాపింగ్​ మాల్స్​, విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకోవు!

విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్​, ప్రార్థనా మందిరాల మూసివేత మే 3 తర్వాత కూడా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజున లాక్​డౌన్​ పొడిగింపుపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్​డౌన్​ పొడిగించాలని కోరారు.

schools-malls-public-transport-likely-to-remain-shut
షాపింగ్​ మాల్స్​, విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకోవు!
author img

By

Published : Apr 28, 2020, 7:21 AM IST

Updated : Apr 28, 2020, 7:58 AM IST

కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ మే 3తో ముగియనుంది. ఆ తర్వాత కూడా విద్యాసంస్థలు, షాపింగ్​ మాల్స్​, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రవాణా సౌకర్యాలు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండటం వంటి వాటి మున్ముందు కూడా ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.

కరోనా పోరుకోసం వ్యూహాన్ని రూపొందించేదుకు ఇవాళ సమావేశం నిర్వహించారు అధికారులు. దేశవ్యాప్త లాక్​డౌన్​ పొడిగించాలా? వద్దా? అనే విషయంపై ఈ వారాంతంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మే నెల మధ్య నుంచి కరోనా పరిస్థితికి అనుగుణంగా పలు ప్రాంతాల్లో రైలు, విమాన సేవలు పునరుద్ధరించే అవకాశాలున్నాయన్నారు.

కరోనా ప్రభావం లేని గ్రీన్​ జోన్లలో పరిమిత సంఖ్యలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైలు, విమాన సేవలు మాత్రం ఇప్పట్లో ప్రారంభం కావని స్పష్టం చేశారు..

మోదీతో ముఖ్యమంత్రులు

దేశంలో కరోనా పరిస్థితిపై మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు లాక్​డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపారు. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించి కార్యకలాపాలు జరిగేలా చూడాలని ఇతర సీఎంలు సూచించారు.

వలస కార్మికులపై...

పని కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి లాక్​డౌన్​ సమయంలో చిక్కుపోయిన కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలని పలువురు ముఖ్యమంత్రులు మోదీకి సూచించినట్లు అధికారులు తెలిపారు.

మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో హోంమంత్రి అమిత్​ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ హాజరు కాలేదు.

Last Updated : Apr 28, 2020, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.