జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతోపాటు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఆంక్షలు వంటి అంశాలపై దాఖలైన వ్యాజ్యాలపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విననుంది.
ఆజాద్ పిటిషన్‌పైనా విచారణ
తన సొంత రాష్ట్రమైన కశ్మీర్‌ను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన వాజ్యాన్ని నేడు విచారించునుంది సుప్రీం. తన కుటుంబ సభ్యులు, మిత్రులను కలిసేందుకు అనుమతివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు ఆజాద్. కశ్మీర్లో ఆంక్షల విషయాన్నీ ప్రస్తావించారు.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ సందర్శనకు ప్రయత్నించిన ఆజాద్‌ను విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు పోలీసులు. అక్కడి నుంచే వెనక్కిపంపించారు.
సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ తన వ్యక్తిగతమని, రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు ఆజాద్. తన ఇంటికి వెళ్లేందుకు మూడు సార్లు ప్రయత్నించినా అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు.