ETV Bharat / bharat

అర్ణబ్​ పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు విచారణ - సుప్రీంకోర్టు

రిపబ్లిక్ టీవీ ఛానల్​ ప్రధాన సంపాదకుడు అర్ణబ్​ గోస్వామి.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను సవాల్​ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. తమపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దాడి చేయించారని అర్ణబ్​​ ఆరోపించిన నేపథ్యంలో ఆయనపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో వందలాది ఎఫ్​ఐఆర్​లు నమోదైనట్లు సమాచారం.

SC to hear Arnab Goswami's petition challenging FIRs against him on Friday
ఆర్నాబ్​ పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు విచారణ
author img

By

Published : Apr 24, 2020, 7:27 AM IST

దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను సవాల్​ చేస్తూ ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్​, జస్టిస్ ఎం.ఆర్​.షాల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్​ను నేటి ఉదయం 10.30 గంటలకు పరిశీలించనుంది.

దాడి కలకలం

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్​ అర్ణబ్ గోస్వామి దంపతులపై దాడి.. ముంబయిలో కలకలం రేపింది. వర్లీలోని తమ టీవీ స్టూడియో నుంచి ఇంటికి వెళుతుండగా.. రాత్రి 12.15 గంటలకు ఈ ఘటన జరిగిందని అర్ణబ్​ చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు తమ కారును అడ్డగించి ధ్వంసం చేస్తూ తీవ్రంగా దూషించారని ఆరోపించారు.

సోనియా పనే: అర్ణబ్​

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే.. ఆమె అనుచరులతో తమపై దాడి చేయించినట్లు ఆరోపించారు అర్ణబ్. మహారాష్ట్ర పాల్​ఘడ్​లో దాడులు సహా మరికొన్ని వ్యవహారాల్లో సోనియాను ప్రశ్నించటం వల్లనే ఇలా తనపై దాడి చేసి ఉంటారని అర్ణబ్​ తెలిపారు.

ఈ నేపథ్యంలోనే.. ఆయనపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వందలాది ఎఫ్​ఐఆర్​లు నమోదైనట్లు సమాచారం.

ఖండించిన భాజపా

అర్ణబ్​పై జరిగిన దాడిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్ ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ముఖ్యనేతలు కూడా ఈ ఘటనను ఖండించారు. ప్రెస్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అర్ణబ్​పై దాడిని తప్పుపట్టింది. మరో వైపు అర్ణబ్​ దంపతులపై దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: 8 నెలల గర్భిణి.. అయినా విధులకు హాజరైన ఎస్​ఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.