ETV Bharat / bharat

'వారి మృతదేహాల నిర్వహణ భయానకం, దయనీయం' - supreme court on corona dead bodies

కరోనా మృతదేహాల నిర్వహణ తీరు అత్యంత దుర్భర పరిస్థితులను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఈ అంశంపై కేంద్రం, దిల్లీ, బంగాల్​, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

SC terms as "horrific" the situation in Delhi
కరోనా మృతదేహాల నిర్వహణ
author img

By

Published : Jun 12, 2020, 2:09 PM IST

కరోనా రోగుల చికిత్స, మృతదేహాల అంత్యక్రియల నిర్వహణపై సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఆసుపత్రుల్లో, చెత్త కుప్పల్లో కరోనా మృతదేహాలు పడేసిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఏం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం.

దిల్లీ ఆసుపత్రుల్లో పరిస్థితి అత్యంత దయనీయం, భయానకమని విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దిల్లీలో పరీక్షల శాతం ఎందుకు తగ్గిందని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పడకలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పడకలు ఖాళీగా ఉన్నాయంటోందని వ్యాఖ్యానించింది.

నోటీసులు..

కరోనాతో చనిపోతే బంధువులకు సమాచారం ఇవ్వటం లేదన్న మీడియా కథనాలతో ప్రస్తుత పరిస్థితి అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ధర్మాసనం. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని పేర్కొంటూ.. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ, బంగాల్​, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

ఇదీ చూడండి: భారత పౌరులపై నేపాల్​ పోలీసుల కాల్పులు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.