కొవిడ్ నిర్ధరణ పరీక్షలపై సుప్రీంకోర్టు... కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టుకు గరిష్ఠంగా రూ.400 మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశింది. ఇందుకుగాను రెండు వారాల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది.
ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు రూ.200 ఖర్చు అవుతుంటే ఆస్పత్రులు, ల్యాబ్స్ ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయని న్యాయవాది అజయ్ అగర్వాల్ పిటిషన్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే ధరను అమలు చేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.