ETV Bharat / bharat

'15 రోజుల్లోగా వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చాలి'

migrants
సుప్రీం
author img

By

Published : Jun 5, 2020, 2:29 PM IST

Updated : Jun 5, 2020, 3:03 PM IST

14:27 June 05

15రోజుల్లో వలస కార్మికులను తరలించాలి: సుప్రీం

వలస కూలీలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను అందరినీ 15 రోజుల్లోగా వారివారి స్వస్థలాలకు చేర్చాలని స్పష్టం చేసింది.  

కరోనా లాక్​డౌన్​ కారణంగా వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై సుమోటోగా విచారించిన జస్టిస్ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. తొలుత ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్​ జనరల్ తుషార్​ మోహతా.. వలస కూలీలను తరలించేందుకు జూన్​ 3 వరకు 4,200 వేల శ్రామిక్​ రైళ్లను నడిపామని తెలిపారు.  

రాష్ట్రాలు చెబితేనే..

ఇప్పటివరకు కోటి మంది కూలీలను స్వస్థలాలకు చేర్చామని కోర్టు విన్నవించారు మెహతా. వీటిలో ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​కు ఎక్కువ సర్వీసులు నడిపామని స్పష్టం చేశారు.  

"అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక అవసరం. ఎంతమంది కూలీలు ఉన్నారు. ఎన్ని రైళ్లను ఏర్పాటు చేయాలో రాష్ట్రాలే కేంద్రానికి తెలియజేయాల్సి ఉంది."

- తుషార్​ మోహతా, సొలిసిటర్ జనరల్​

సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లాలనుకునే వలస కార్మికులకు రైలు లేదా బస్సు ఛార్జీలు వసూలు చేయరాదని మే 28న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన కూలీలకు సంబంధిత అధికారులు ఉచితంగా ఆహారాన్ని అందించాలని మే 28 న ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 

Last Updated : Jun 5, 2020, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.