ETV Bharat / bharat

కేంద్రం 'వైఫల్యం'పై వ్యాజ్యం- కొట్టివేసిన సుప్రీం

author img

By

Published : Oct 1, 2020, 4:07 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణలో కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమయ్యాయంటూ దాఖలైన రెండు వేర్వేరు వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

SC rejects PIL for independent probe into "mismanagement" of COVID-19 pandemic
'మీరూ మీరూ తేల్చుకోవాలి.. కోర్టు జోక్యం చేసుకోదు!'

కరోనా కట్టడిలో కేంద్రప్రభుత్వం విఫలమైందని, ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

వైరస్​ నియంత్రణ కోసం ప్రభుత్వం సకాలంలో సరైన చర్యలు చేపట్టలేదని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 4నే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీచేసినా మార్చి 4 వరకు అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రారంభించలేదని గుర్తుచేశారు. జనసమూహాలు ఉండకుండా చూడాలన్న హోంశాఖ సూచనలకు విరుద్ధంగా ఫిబ్రవరి 24న "నమస్తే ట్రంప్" పేరిట భారీ కార్యక్రమం నిర్వహించడాన్ని ప్రస్తావించారు. నిపుణులు వద్దని హెచ్చరించినా లాక్​డౌన్​ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కోర్టుకు వివరించారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్.

అయితే ఈ వ్యాజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము జోక్యం చేసుకోమని స్పష్టంచేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థపై...

ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించలేకపోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులే పూచీవహించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను గురువారం సుప్రీం కోర్టు తిరస్కరించింది.

డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడంలో ఆలస్యం చేసిందని పిటిషన్ దాఖలు చేశారు ప్రముఖ వైద్యులు రామన్ కాకర్. తప్పించుకోలేని మారణహోమానికి డబ్ల్యూహెచ్ఓ కారణమని అభిప్రాయపడ్డారు. చైనా నుంచి వచ్చిన వైరస్ వల్ల దేశం కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు చైనా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. చైనా ప్రభుత్వానికి సమన్లు జారీ చేసే అధికారం భారత సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఓ దేశానికి ఉన్నత న్యాయస్థానం అయినంత మాత్రానా.. పక్క దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలను ఆదేశించలేమని తెలిపింది.

ఇదీ చదవండి: ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.