ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్ కేసుకు సంబంధించిన 5 కేసులను దిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లో మొత్తం విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు తెలిపింది. బాధితురాలి కారు ప్రమాద ఘటనపై 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశించింది.
బాధితురాలిని దిల్లీకి తరలించడంపై వారి కుటుంబమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తెలిపింది. బాధితురాలికి, ఆమె న్యాయవాదికి చెరో రూ. 25 లక్షల మధ్యంతర పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్ బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలిపింది.