పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహిన్ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారితో చర్చించేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు మధ్యవర్తులను నియమించింది. సంజయ్ హెగ్డే, సాధనా రామచంద్రన్‌లను మధ్యవర్తులుగా నియమించింది. ఆందోళనకారులతో మాట్లాడి రాకపోకలకు అంతరాయం కల్గకుండా మరో చోట నిరసన చేపట్టేలా చూడాలని వారికి సూచించింది.
సుప్రీం ఆదేశాలతో షాహిన్‌బాగ్ చేరుకున్న ఇద్దరు మధ్యవర్తులు ఆందోళనకారులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నిరసన తెలిపే హక్కును సమర్ధించిందని, తాము అందరి వాదనలు ఆలకిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: పురుషాధిక్యతకు చెక్.. సైన్యంలో సమన్యాయం