ETV Bharat / bharat

ఆ బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీం ఓకే

అత్యవసర సేవలు సహా దిల్లీ పోలీసులు వినియోగించేందుకు ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. ఫాడా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 1 నుంచి బీఎస్​-6 వాహనాలనే విక్రయించాలని గతంలోనే స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

SC allows registration of BS-IV diesel vehicle purchased before April 1 for essential public services use
ఆ బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీం అనుమతి
author img

By

Published : Sep 18, 2020, 5:55 PM IST

బీఎస్​-4 డీజిల్​ వాహనాలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అత్యవసర సేవలకు వినియోగించేందుకు ఏప్రిల్​ 1కి ముందు కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. దిల్లీ పోలీసులు, మున్సిపల్​ కార్పొరేషన్లు అత్యవసర సేవల కోసం ఈ వాహనాలను వినియోగించవచ్చని స్పష్టం చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక సూచనలు చేసింది. ఏప్రిల్​ 1కి ముందు కొనుగోలు చేసిన బీస్​-4 వాహనాలు, ఆ తర్వాత కొనుగోలు చేసిన బీఎస్​-6 వాహనాల రిజిస్ట్రేషన్లు వాటి నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న సీఎన్​జీ వాహనాల నమోదుకూ అత్యున్నత న్యాయస్థానం సమ్మతి తెలిపింది.

సుప్రీంను ఆశ్రయించిన ఫాడా..

బీఎస్​-4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు ఒక నెల గడువు పెంచాలని.. మార్చిలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య(ఫాడా). కరోనా సంక్షోభం కారణంగా అమ్మకాలు నిలిచిపోయి.. నష్టపోయామని సుప్రీంకు వివరించింది. కరోనా లాక్​డౌన్​ అనంతరం దేశ రాజధాని ప్రాంతం మినహా మిగిలిన చోట్ల 10 రోజుల పాటు బీఎస్​-4 వాహనాలను విక్రయించడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ వాహనాల రిజిస్ట్రేషన్​కు అనుమతిచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 వాహనాలనే విక్రయించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. బీఎస్-​4 వాహనాలు నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా 2017 ఏప్రిల్​ నుంచి వీటిని ​నిషేధించింది.

ఇదీ చూడండి: బీఎస్​4 వాహనాల అమ్మకానికి గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.