ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ విభాగ ఫ్యాకల్టీగా పని చేస్తోన్న సుమిత పంజ్వాణీకి మహిళలకు, రైతులకు ఉపయోగపడేలా ఏదైన ఉత్పత్తి చేయాలనే ఆలోచన వచ్చింది. వరిపొట్టు గడ్డితో శానిటరీ ప్యాడ్‌ను తయారు చేయాలనుకున్నారు.
భారత ప్రభుత్వ అంకుర సంస్థల యోజన ప్రోత్సాహంతో అగ్రీ బిజినెస్(వ్యవసాయ ఆధారిత వ్యాపారం) ఆలోచనకు పదును పెట్టారు. ఇంకేముంది కొద్ది రోజుల్లోనే పొలంలోని చెత్తలో నిక్షిప్తమై ఉన్న సెల్యులోజ్‌తో శానిటరీ నాప్కిన్ను తయారు చేసి చూపించారు. ఇందుకు వారికి రూ.5 లక్షల దాకా ప్రోత్సాహకం లభించింది.
కేన్సర్‌కు కారణమిదే
సాధారణంగా మహిళలు వాడే శానిటరీ ప్యాడ్లు సర్వైకల్ కేన్సర్, యూటీఐ వ్యాధులకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ కేన్సర్‌తో మరణిస్తున్నవారిలో 1/4 వంతు భారతీయులే అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా అవి భూమిపై కుప్పలు తెప్పలుగా చేరి పర్యావరణానికి హాని చేస్తున్నాయంటున్నారు నిపుణులు.
'పవిత్ర వర్క్‌షాప్‌లో మేము రుతుక్రమ ఆరోగ్యం, శుభ్రతపై శిక్షణ ఇస్తూంటాం. అప్పుడే నాకు అనిపించింది ఈ సమస్య చాలా పెద్దదని. మహిళలకు నెలసరి సమయంలో శుభ్రత విషయంలో అవగాహన లేదు. మరోవైపు ప్రస్తుతం వాడుతున్న శానిటరీ న్యాపికిన్లలో భారీగా ప్లాస్టిక్, సింతెటిక్ వినియోగం జరుగుతోంది. అవి భూమిలో స్వతహాగా నాశనం కావు.'
- సుమిత పంజ్వాణీ, సామాజిక కార్యకర్త
పొరపాటు చేస్తున్నారు
ఇక రైతులు తమకు తెలియకుండానే వాయు కాలుష్యం సృష్టించి, భూసారాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు సమిత.
'వరి పొట్టును, పొలంలో మిగిలిపోయిన గడ్డిని రైతులు కాల్చేస్తారు. ఈ కారణంగా వాయు కాలుష్యం వ్యాపిస్తోంది. పైగా భూమిలోని మంచి చేసే సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి. కానీ రైతులు చెత్త నుంచి ఉపశమనం పొందడానికి వాటిని కాల్చేస్తున్నారు.'
- సుమిత పంజ్వాణీ, సామాజిక కార్యకర్త
ఇదీ చదవండి:పిల్లలు చెమట చుక్కలు చిందించట్లేదు