కర్ణాటక, బెంగళూరులో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తుందన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టి విజయవంతమైంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ). దాదాపు రూ. 2 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేసింది. పలువురు డ్రగ్ డీలర్లను అదుపులోకి తీసుకుంది.
ఈ కేసులో గంజాయి డీలర్, కన్నడ సీరియల్ నటి అనికాను అరెస్ట్ చేసింది ఎన్సీబీ. డ్రగ్స్ మాఫియా గురించి అనికాను లోతుగా విచారించగా.. ప్రముఖ కన్నడ సినిమా తారలు, సంగీత దర్శకులు, గాయకుల తన ప్రధాన కస్టమర్లని పేర్కొంది. ఎన్నో కన్నడ సీరియల్స్ లో నటించిన అనికా.. తనకున్న పరిచయాలతో తారలకు గంజాయి సరఫరా చేసినట్లు అంగీకరించింది.
ఇప్పటికే దాదాపు రూ.2 కోట్లు విలువైన 145 ఎండీఎమ్ఏ, 180 ఎల్ఎస్ డీ మత్తు మాత్రలను సీజ్ చేసింది ఎన్సీబీ బృందం. డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు అధికారులు. ఇక మత్తుకు బానిసలైన తారలకు సంబంధించి మరిన్ని వివరాలను అనికా ద్వారా తెలుసుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండి:'అలా చేయడం సభా హక్కులను ఉల్లంఘించడమే'