ETV Bharat / bharat

స్టార్​ హీరో​ కోసం 600కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని - sallu bhai fan rides cycle at the age of 60

బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ఖాన్​ను కలిసేందుకు 56 ఏళ్ల వయసులో సాహసమే చేశాడు అసోంకు చెందిన ఓ అభిమాని. ఐదు రోజుల్లో సుమారు 600 కిలోమీటర్లు సైకిల్​ యాత్ర చేసి సల్మాన్​పై ప్రేమను ఒలకబోశాడు.

salman khan fan from Assam rides cycle for 600 kilometers meet him in guwahati filmfare
స్టార్​ హీరో​ కోసం 600కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని
author img

By

Published : Feb 15, 2020, 7:39 AM IST

Updated : Mar 1, 2020, 9:31 AM IST

అసోం తిన్సుకియాకు చెందిన భూపెన్​ లిక్సన్​కు సల్మాన్​ఖాన్​ అంటే మహా ఇష్టం. ఎంతంటే.. సల్మాన్​ను కలిసేందుకు​ 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసేంత! అవును, తన అభిమాన హీరో గువహటికి వస్తున్నాడని తెలుసుకుని సైకిల్​ పెడల్​కు పని చెప్పాడు. ఐదు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని భాయ్​ కోసం వేచి చూస్తున్నాడు.

స్టార్​ హీరో​ కోసం 600కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని

"నేను నా ప్రయాణాన్ని ఈ నెల 8న జగూన్​ నుంచి ప్రారంభించా. గువహటిలో జరుగుతున్న ఫిల్మ్​ఫేర్​ అవార్డు కార్యక్రమానికి హాజరవుతున్న సల్మాన్​ఖాన్​ను కలిసేందుకే సైకిల్​పై వచ్చా."

-భూపెన్ లిక్సన్, సల్మాన్ అభిమాని

భూపెన్​ సైకిల్​ హ్యాండిల్​ను తాకకుండా.. 60 నిమిషాల్లో 48 కిలోమీటర్లు సైకిల్​ నడిపి ఇప్పటికే ఇండియా బుక్​ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు 56 ఏళ్ల వయసులో 600 కిలోమీటర్లు సైకిల్​ యాత్ర చేసి సల్మాన్​పై వీరాభిమానాన్ని చాటుకున్నాడు.

Last Updated : Mar 1, 2020, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.