ETV Bharat / bharat

సాయి జన్మస్థల వివాదం: నేడు శిరిడీ బంద్​..! - BUSINESS NEWS IN TELUGU

మహారాష్ట్రలో సాయిబాబా జన్మభూమిపై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ బంద్​ నిర్వహించాలని నిర్ణయించారు శిరిడీ వాసులు. అయితే.. ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు నిర్వాహకులు. మరోవైపు.. వివాదాన్ని పరిష్కరించే దిశగా చర్చలు జరపనున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే.

saibaba-birthplace-row-cm-to-hold-meeting

author img

By

Published : Jan 19, 2020, 5:36 AM IST

Updated : Jan 19, 2020, 6:52 AM IST

సాయి జన్మస్థల వివాదంతో నేడు శిరిడీ బంద్​

సాయి జన్మస్థలం వివాదం మరింత ముదురుతోంది. పాథ్రీని సాయి జన్మభూమిగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ బంద్​ పాటించాలని నిర్ణయించారు శిరిడీ వాసులు. చరిత్రలో మొదటిసారి శిరిడీ మూతపడనుంది. బంద్​కు స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్​ మద్దతిచ్చారు. అయితే.. ఆలయం మాత్రమే తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు సంస్థాన్​ ట్రస్ట్​ నిర్వాహకులు.

శిరిడీకి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. బంద్​ నిర్ణయం.. భక్తులు, పర్యటకులపై భారీ ప్రభావం చూపనుంది. మరోవైపు ఆదివారం నుంచి పాథ్రీలోనూ బంద్​ పాటిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది పాథ్రీ కృతి సమితి.

ఇదీ వివాదం...

మహారాష్ట్ర పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ఇటీవల ప్రకటించగా వివాదం చెలరేగింది. ఈ నిర్ణయంపై శిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాథ్రీ సాయి జన్మస్థలమని చెప్పేందుకు ఆధారాల్లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సాయి జన్మభూమి వివాదం సద్దుమణిగే దిశగా ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. సంబంధిత పార్టీలతో రాష్ట్ర సచివాలయంలో సీఎం త్వరలోనే సమావేశం కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం.

Last Updated : Jan 19, 2020, 6:52 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.