ETV Bharat / bharat

మాజీ ఐపీఎస్​ సంజీవ్​ భట్​కు జీవితఖైదు

కస్టడీలో ఉన్న వ్యక్తి మృతికి కారణమైన 29 ఏళ్ల నాటి కేసులో.. మాజీ ఐపీఎస్​ అధికారి సంజీవ్​ భట్​కు జీవితఖైదు విధించింది గుజరాత్​ జామ్​నగర్​ సెషన్స్​ కోర్టు. 2011లో ఐపీఎస్​ హోదా నుంచి బహిష్కరణకు గురయ్యారు భట్​. ఆయన​తో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం.

మాజీ ఐపీఎస్​ సంజీవ్​ భట్​కు జీవితఖైదు
author img

By

Published : Jun 20, 2019, 4:57 PM IST

Updated : Jun 20, 2019, 7:03 PM IST

మాజీ ఐపీఎస్​ సంజీవ్​ భట్​కు జీవితఖైదు

29 ఏళ్ల నాటి కస్టడీలో వ్యక్తి మృతి కేసులో మాజీ ఐపీఎస్​ అధికారి సంజీవ్​ భట్​ను దోషిగా తేల్చింది జామ్​ నగర్​ సెషన్స్​ కోర్టు. ఆయనతో పాటు మరో ఆరుగురు పోలీసులను దోషులుగా ప్రకటించింది.

భట్​తో సహా మరో పోలీస్​ కానిస్టేబుల్​ ప్రవీణ్​ సింగ్​ జాలాకు భారతీయ శిక్షాస్మృతి-302 ప్రకారం జీవిత ఖైదు విధించింది. ఎస్​ఐ దీపక్​ షా, శైలేశ్​ పాండ్య, కానిస్టేబుళ్లు ప్రవీణ్​ ​సింగ్​ జడేజా, అనోప్​ సింగ్​ జెథ్వా, కేషుబా జడేజాలకు రెండేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది.

ఇదీ జరిగింది..

1990 అక్టోబర్​ 30న మతఘర్షణల కారణంతో గుజరాత్​లోని జామ్​జోధ్​పుర్​లో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అదనపు ఎస్పీగా సంజీవ్​ భట్​ ఉన్నారు. అనంతరం వారందరినీ విడిచిపెట్టగా.. ప్రభుదాస్​ వైష్ణాని అనే వ్యక్తి ఆసుపత్రిలో మరణించారు.

బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు భట్​తో పాటు మరో ఆరుగురు పోలీసు అధికారులపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. నిర్బంధంలో ఉంచి చిత్రహింసలు పెట్టడం వల్లే వైష్ణాని మరణించాడని ఆరోపించారు ఆయన సోదరుడు. అప్పట్లో భట్​పై విచారణకు అనుమతి ఇవ్వలేదు రాష్ట్ర​ ప్రభుత్వం.

29 ఏళ్ల తర్వాత నేడు జామ్​నగర్​ సెషన్స్​ కోర్టు వీరిని దోషులుగా తేల్చి శిక్షలు విధించింది.

2011లో బహిష్కరణ..

2011లో ఐపీఎస్​ హోదా నుంచి సంజీవ్​ భట్​ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం అనధికారంగా విధులకు హాజరుకాని కారణంగా హోం మంత్రిత్వ శాఖ ఈయనను తొలగించింది.

ఓ వ్యక్తి మాదకద్రవ్యాలు కలిగి ఉన్నాడనే తప్పుడు కేసు నమోదు చేశారన్న ఆరోపణలతో 2018 సెప్టెంబర్​ 5న మరోసారి అరెస్టయ్యారు భట్​. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది.

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Thursday 20th June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Uruguay hold press conference ahead of Copa America Group C clash with Japan in Porto Alegre. Expect at 0200.
SOCCER: Atletico Madrid coach Diego Simeone honoured by the city of Buenos Aires. Expect at 0100.
SOCCER: DR Congo look ahead to their Africa Cup of Nations Group A match against Uganda. Expect at 0100.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Jun 20, 2019, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.