ETV Bharat / bharat

కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా!

కరోనా వైరస్ వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించినట్లు రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విషయాన్ని రష్యా మీడియా సంస్థలు వెల్లడించాయి.

Russia
కరోనా వ్యాక్సిన్
author img

By

Published : Aug 15, 2020, 4:55 PM IST

రష్యా ఆమోదం తెలిపిన 'స్పుత్నిక్- వీ' కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా సంస్థలు నివేదించాయి.

ఈ వ్యాక్సిన్​పై అంతర్జాతీయంగా సందేహాలు వస్తోన్నా వ్యాక్సిన్​కు ఆమోదం తెలిపింది రష్యా ప్రభుత్వం. ప్రకటన సమయంలో తన కూతురిపైనా వ్యాక్సిన్ ప్రయోగించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సామర్థ్యానికి అవసరమైన పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

ప్రమాదం..!

చివరి క్లినికల్​ ట్రయల్స్​లో పాల్గొన్న వలంటీర్ల అందరిలో రోగనిరోధక ప్రతిస్పందన కనిపించిందని పుతిన్ స్పష్టం చేశారు. అయితే మూడో దశ పరీక్షలు నిర్వహించకుండా తొందరపడటం ప్రమాదమని రష్యాతో పాటు ఇతర దేశాల శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ రేసులో ట్రంప్​పై పుతిన్​ గెలిచారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.