బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్వాగతించింది. ఈ నేపథ్యంలో దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి.. ప్రజలు సామరస్యంగా పని చేయాలని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి.
"బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం. దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజలందరూ ఐకమత్యంతో సామరస్యంగా పని చేయాలి. తద్వారా దేశ అభివృద్ధికి పాటుపడాలి."
- సురేశ్ భయ్యాజీ జోషి
బాబ్రీ మసీదు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మందిని నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు.
ఇదీ చూడండి: బాబ్రీ తీర్పుపై అడ్వాణీ, జోషి హర్షం