గుజరాత్లోని రెండు స్థానాల ఎన్నికల కోసం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. భాజపా తరఫున విదేశాంగమంత్రి జైశంకర్, జుగల్జి ఠాకూర్... కాంగ్రెస్ నుంచి చంద్రిక చూదసమ, గౌరవ్ పాండ్య మంగళవారం నామపత్రాలు దాఖలు చేశారు.
జైశంకర్ టాప్...
విద్యాపరంగా వీరిలో జైశంకర్ అత్యంత అర్హుడు. ఠకూర్ అత్యంత ధనికుడు. నామపత్రంలో ఠాకూర్ తన సంపద రూ.101కోట్లుగా పేర్కొన్నారు.
ఎంఏ, ఎం.ఫిల్, పీహెచ్డీ పట్టా పొందినట్టు జైశంకర్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి సంపద రూ.15.82 కోట్లు.
ధనికుల జాబితాలో ఈ నలుగురిలో రూ.2.56 కోట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రిక చూదసమ చివరి స్థానంలో ఉన్నారు. తనపై పోలీసు ఆదేశాల ధిక్కరణ కేసు ఉందని గౌరవ్ పాండ్య నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.
గుజరాత్లోని రెండు రాజ్యసభ స్థానాలకు జులై 5న ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:- భారత్కు చేరుకున్న పాంపియో- నేడు మోదీతో భేటీ