ETV Bharat / bharat

అయోధ్యలో రోప్​వే నిర్మాణానికి సన్నాహాలు - అయోధ్యలో రోప్​వే

అయోధ్యలో రోప్​వే నిర్మాణానికి అక్కడి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్విట్జర్లాండ్​కు చెందిన ఓ సంస్థతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు రామ మందిరాన్ని దర్శించుకునేందుకు ఈ రోప్​వే ద్వారా ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.

Ropeway to be installed for devotees in Ayodhya
అయోధ్యలో రోప్​వే నిర్మాణానికి సన్నహాలు
author img

By

Published : Dec 10, 2020, 6:20 AM IST

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని దర్శించుకునేందుకు రోప్​వేను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం స్విట్జర్లాండ్​కు చెందిన ఓ సంస్థతో మున్సిపల్ అధికారులు చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

ఆలయ ప్రాంగణంలో ఒక పాయింట్ ఏర్పాటు చేసి భక్తులకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో మరో పాయింట్​ను ఏర్పాటు చేయనున్నట్లు అయోధ్య మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు.

"ఔట్-స్టేషన్ కోసం ఆమోదయోగ్యమైన స్థలాన్ని త్వరలో ఎంపిక చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఇక్కడికి వస్తారు. రోప్​వే నిర్మించిన తర్వాత దివ్యాంగులు, వృద్ధులకు ప్రయోజనం కలుగుతుంది."

-విశాల్ సింగ్, అయోధ్య మున్సిపల్ కమిషనర్

మందిర నిర్మాణానికి చలువరాళ్ల(మార్బుల్)ను ఆలయ పరిసరాల్లోకి తీసుకెళ్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు క్రేన్లు, పది ట్రక్కులు, 50 మంది కార్మికులు ఈ పనిలో నిమగ్నమైనట్లు స్పష్టం చేశాయి.

ఇదీ చదవండి: 'రామాలయం స్తంభాలు వెయ్యేళ్లు పదిలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.