ETV Bharat / bharat

'టీకా అభివృద్ధి, ఉత్పత్తిలో స్వావలంబనపై కేంద్రం దృష్టి'

కరనా వ్యాక్సిన్​ అభివృద్ధి కోసం ప్రపంచం పరుగులు పెడుతున్న క్రమంలో వ్యాక్సిన్​ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటంలోనూ స్వావలంబన సాధించటంపై భారత్​ దృష్టి సారించినట్లు చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. వ్యాక్సిన్​ తయారీని బలోపేతం చేయటం సహా డిమాండ్​కు అనుగుణంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Harsha vardhan
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
author img

By

Published : Nov 26, 2020, 5:33 AM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్​ తయారీని బలోపేతం చేయటం సహా డిమాండ్​కు అనుగుణంగా వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. ప్రపంచమంతా.. కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధిలో పోటీపడుతుంటే.. భారత్​ మాత్రం.. టీకా అభివృద్ధి, భారీస్థాయిలో ఉత్పత్తి.. రెండింటిలోనూ స్వావలంబన సాధించటంపై దృష్టి సారించినట్లు చెప్పారు.

సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్​ ఆర్​ అండ్​ డీ సమ్మిట్-2020లో వర్చువల్​గా పాల్గొన్నారు హర్షవర్ధన్​. ప్రపంచ ఫార్మసీ హబ్​గా పిలిచే భారత్​కు.. కొవిడ్​-19 వ్యాక్సిన్​ను భారీస్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని పునరుద్ఘాటించారు.

" రానున్న రోజుల్లో ఎదురయ్యే డిమాండ్​కు తగినట్లు భారీస్థాయిలో వ్యాక్సిన్​ తయారీ, పంపిణీ వ్యవస్థపై ప్రస్తుతం దృష్టి సారించాం. పరిశ్రమలు సమస్యను పరిష్కరించటమే కాకుండా భవిష్యత్తు కోసం ఉత్తమ పద్ధతులను రూపొందించటంలోనూ మాకు సహాయపడే సమయం ఇది. పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు జీవన విధానంలో కీలకం "

- హర్షవర్ధన్​, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి.

సాంప్రదాయక విధానాల కోసం కాకుండా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం, పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్​లో పెట్టుబడులు పెట్టి.. భారత్​, ప్రపంచం కోసం ఉత్పత్తి చేసే సంస్థలకు సాయం చేయాలని కేంద్ర నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. భారత్​ సరళీకరణ, ప్రపంచీకరణ కాలం నుంచి స్వయం సమృద్ధి గల దేశంగా మారడానికి తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన స్థితికి చేరుకుంటోందన్నారు మంత్రి.

ఇదీ చూడండి: 'ఆత్మపరిశీలనకూ సమయం కేటాయించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.