ఒడిశా అంగుల్ జిల్లా గురుండా వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు, జీపు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. బాధితులు కారులో రాయపుర్ నుంచి పూరీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీపంలోని అంగుల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.