ETV Bharat / bharat

రాజ్యసభ డీసీ​​ రేసులో విపక్షాల అభ్యర్థిగా మనోజ్

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ పదవికి ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయి. విపక్షాలన్నీ కలిసి బిహార్​ ఆర్జేడీ ఎంపీ మనోజ్​ ఝాను ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దింపాలని నిర్ణయించాయి.

rjds-manoj-jha-might-be-opposition-candidate-against-ndas-harivansh
ప్రతిపక్షాల మద్దతుతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​​ బరిలో మనోజ్​!
author img

By

Published : Sep 10, 2020, 3:52 PM IST

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఈనెల 14న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పక్షం ఎన్డీఏ, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ తమ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ​ హరివంశ్​ పేరును ఇప్పటికే ఖరారు చేసింది. అధికార కూటమిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించాయి. అది కూడా బిహార్​కు చెందిన ఆర్జేడీ ఎంపీ మనోజ్​ ఝా పేరును ఖరారు చేసినట్లు సమాచారం. శుక్రవారం మనోజ్​ ఝా నామినేషన్​ దాఖలు చేసే అవకాశం ఉంది.

మనోజ్​ ఝా మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు మంచి వక్తగా పేరుంది.

రాజ్యసభ ఛైర్మన్​ పదవికి పోటీ పడుతున్న ఇద్దరు నేతలు బిహార్​కు చెందిన వారే కావడం గమనార్హం. త్వరలో బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికి ముందు జరిగే ఈ పోరు రాజ్యసభ వేదికగా జేడీయూ వర్సెస్ ఆర్జేడీ మధ్య పోటీగా మారే అవకాశం ఉంది.

బలాబలాలు ఇలా...

రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. ఎన్డీఏకు 116 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీకి దగ్గరగా ఈ కూటమే ఉంది. బీజేడీ, వైకాపార్టీ, తెరాస వంటి ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉంది.

పట్నాయక్​కు నితీశ్​ ఫోన్​

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న హరివంశ్​ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని బిహార్​ సీఎం నితీశ్​ కుమార్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్​ను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.